విశాఖ ప్రజలకు సురక్షిత తాగునీటి సరఫరా నిత్యం కొనసాగుతోందని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. తాగునీటి లీకేజీలు, కలుషిత నీరు, సరఫరా అంతరాయాలపై 1800 4250 0009 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరిస్తామని ఆయన సూచించారు. ప్రజలు ఈ నెంబర్‌కు సమాచారం అందించి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు.