KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్పర్సన్ పుల్లూరి స్వప్న తెలిపారు. ఈనెల 14, 15, 16 మూడు రోజులు సంక్రాంతి సెలవులు, 17,18 శని, ఆదివారాల్లో వారాంతపు సెలవు కావడంతో మార్కెట్ యార్డు బంద్ ఉండనున్నట్లు ఆమె తెలిపారు. తిరిగి ఈనెల 19న మార్కెట్ యథావిధిగా పునఃప్రారంభం అవుతుందని అన్నారు.