AKP: విద్యుత్ చార్జీలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఈ నెల 20 నుంచి బహిరంగ ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది అని నర్సీపట్నం ఏపీఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.వి.ఎన్.ఎమ్. అప్పారావు తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 20, 22, 23, 27 తేదీలలో ఉదయం 10:30 గంటల నుంచి ఒక గంట పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగనుందని ఆయన వివరించారు.