న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ కోహ్లీ మరో హాఫ్ సెంచరీ చేస్తే రికార్డు సృష్టిస్తాడు. కోహ్లీ ఇప్పటివరకు వరుసగా ఐదు వన్డేల్లో హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ విషయంలో కోహ్లీ.. సచిన్, రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ, అజింక్య రహానేతో సమానంగా నిలిచాడు. అతడు మరో హాఫ్ సెంచరీ చేస్తే వరుసగా ఆరు మ్యాచుల్లో అర్ధశతకాలు బాదిన మొదటి భారత బ్యాటర్‌గా నిలిచే అవకాశం ఉంది.