టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన మూవీ ‘అనగనగా ఒకరాజు’. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. మూడు రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.61.1 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు.