WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల 6 గ్రామాలు విలీనం చేయడంతో మొత్తం 30 వార్డులు ఏర్పడినప్పటికీ, మున్సిపల్ గ్రీవెన్స్ పోర్టల్లో 24 వార్డులు మాత్రమే కనిపిస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన 6 వార్డులు ఎంపికలో లేకపోవడంతో ఆ వార్డుల ప్రజలు సమస్యలు నమోదు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. అధికారులు వెంటనే పోర్టల్ అప్డేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.