జనగామ మండలం చీటకోడూరు గ్రామానికి చెందిన చెందిన దాసరి మంజుల మోకాలు నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. శస్త్ర చికిత్సకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడగా విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన రూ. 2 లక్షల ఎల్ఓసిని మంజూరు చేయించి, నేడు బాధిత కుటుంబ సభ్యులకు అందించి మానవత్వం చాటుకున్నారు.