BPT: పర్చూరు పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పులి గోపి బుధవారం అదే స్టేషన్కు పూర్తి స్థాయి ఎస్సైగా నియమితులయ్యారు. ప్రజల భద్రతే తన ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణకు కృషి చేస్తానన్నారు. స్థానికుల సహకారంతో పోలీస్ స్టేషన్ను ఆదర్శంగా నిలుపుతానని చెప్పారు.