NZB: ముప్కాల్ మండల కేంద్రంలోని పతంగుల దుకాణాల్లో ఎస్సై కే.కిరణ్ పాల్ బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సంక్రాంతి సందర్భంగా నిషేధిత చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. చైనా మాంజా పక్షులకు, మనుషులకు ప్రాణాంతకమని, ప్రజలు వీటిని వాడొద్దని సూచించారు. పండుగను నిబంధనల ప్రకారం ఆనందంగా జరుపుకోవాలని ఆయన కోరారు.