టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మెన్స్ వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్‌లో నాలుగేళ్ల తర్వాత తొలిసారి నంబర్ 1 స్థానానికి దూసుకెళ్లాడు. పురుషుల వన్డే ర్యాంకింగ్స్‌ను జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఇటీవల కోహ్లీ అద్భుత ప్రదర్శన చేస్తుండడంతో మళ్లీ తొలిస్థానం నిలబెట్టుకున్నాడు. 2021లో చివరిసారిగా కోహ్లీ టాప్ 1గా ఉన్నాడు. ఇక రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు.