ADB: నేటి పోటీ ప్రపంచంలో యువత మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. నిన్న పట్టణంలోని టీటీడీసీ భవనంలో TASK నూతన శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ హాజరై ప్రారంభించారు. కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన టెక్నికల్, నాన్-టెక్నికల్ కోర్సులలో ఉచితంగా శిక్షణ అందజేయనున్నట్లు తెలిపారు.