AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. రూ.కోటి విలువైన ఆభరణాలు అపహరణకు గురైనట్లు ఆలయ ధర్మకర్త వెల్లడించారు. ఇటీవల ఇదే ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. తొక్కిసలాట జరిగినప్పటి నుంచి ఆలయం మూసివేశారు. ఆలయంలో చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.