AP: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం అడ్డు చెబుతున్న విషయం తెలిసిందే. దీనిపై CM చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత TG కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని గుర్తుచేశారు. తెలుగు జాతి ప్రయోజనాల కోసం చేసే పనులపై అభ్యంతరాలు ఉండకూడదని పేర్కొన్నారు.