న్యూజిలాండ్తో తొలి వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 301 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో ఛేదించింది. కోహ్లీ (93), గిల్ (56), అయ్యర్ (49) రాణించగా.. చివర్లో రాణా(29), రాహుల్(29*) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. బౌలర్లలో జెమిసన్ 4 వికెట్లు తీశాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.