AP: అల్మాంట్-కిడ్- జలుబు సిరప్లో లోపాలను అధికారులు గుర్తించారు. మోతాదుకు మించి ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపుల్లో అధికారులు తనిఖీలు చేశారు. ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విక్రయాలు జరగలేదని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా సరఫరా జరగలేదని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.