ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని భీంసరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 2005-06 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఇవాళ అట్టహాసంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన విద్యార్థులు అందరూ ఒక చోటుకు చేరుకొని గత స్మృతులు నెమరు వేసుకొని ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా తమకు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.