NGKL: కల్వకుర్తి మండలం వెల్జాల గ్రామంలోని వేదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు వారిని ఘనంగా సన్మానించారు. ఏటా భక్తిశ్రద్ధలతో జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని వారు తెలిపారు.