E.G: రాజమండ్రిలోని తారకరామారావు నగర్ బీజేపీ పార్టీ కార్యాలయంలో పొగాకు రైతుల సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్సీ సోము వీర్రాజును సాగుదారులు ఆదివారం కలిశారు. సిగరెట్లపై GST రెట్లు పెంపు, పొగాకు రైతుల సమస్యలపై ఎమ్మెల్సీకి వినతి ఇచ్చారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు.