KMM: మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని కల్లూరులోని కాశ్మీర మహాదేవ క్షేత్రంలో జరగనున్న జాతరలో దుకాణాల ఏర్పాటుకు సోమవారం వేలం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఈ ప్రక్రియ మొదలవుతుందని ఈవో ఎస్వీడీ ప్రసాద్ తెలిపారు. ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు నాలుగు రోజుల పాటు ఈ వేలం కాలపరిమితి ఉంటుందని పేర్కొన్నారు.