GNTR: గుంటూరు ఏటీ అగ్రహారంలో SKBM హైస్కూల్లో ITC సౌజన్యంతో నూతన డైనింగ్ హాల్ నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధించడమే కాదు.. ఏది మంచి మార్గం, చెడు మార్గం వంటి విషయాలను చెప్పడం ద్వారా సమాజంలో మంచి వ్యక్తులుగా మారటానికి ప్రయత్నిస్తారని ఎమ్మెల్యే అన్నారు.