KNR: వంటగ్యాస్ వినియోగదారులు తమ ఆధార్ బయోమెట్రిక్ ఈ -కేవైసీ ప్రక్రియను ఈ నెల 31వ తేదీలోపు పూర్తి చేసుకోవాలని TG వంటగ్యాస్ డీలర్ల అధికార ప్రతినిధి పీ.వీ.మదన్ మోహన్ రావు సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు గతంలో డిసెంబర్ 31 వరకు ఇచ్చిన గడువును ఈ నెల 31 వరకు పొడిగించాయన్నారు. ఎక్కువ మంది ప్రక్రియ పూర్తి చేయని కారణంగా పొడిగించినట్లు ఆయన తెలిపారు.