టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ ఓపెనర్లు అరుదైన రికార్డు సాధించారు. హెన్రీ నికోల్స్, డేవన్ కాన్వే కలిసి తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో 1999లో భారత్‌పై కివీస్ ఓపెనింగ్ జోడీ నెలకొల్పిన 115 పరుగుల రికార్డు బద్దలైంది. కాగా, 1988లో ఆండ్రూ జోన్స్ – జాన్ రైట్ జోడీ సాధించిన 140 పరుగులే ఇప్పటివరకు భారత్‌పై అత్యధికం.