NGKL: కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయదని ఆ పార్టీ రాష్ట్ర నేత తల్లోజు ఆచారి వెల్లడించారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకుంటే కల్వకుర్తి, ఆమనగల్లు మున్సిపాలిటీల్లో అభ్యర్థులను నిలబెట్టబోమని ప్రకటించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం తాము ఈ త్యాగానికి సిద్ధమన్నారు.