MDK: త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు మున్సిపల్ అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ వారీగా కమిషనర్లను ఎన్నికల ఏర్పాట్లు గురించి అడిగి తెలుసుకున్నారు.