KRNL:ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా PRC కమిషన్ నియమించకపోవడం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యమని STU రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యుడు బి. మహదేవప్ప విమర్శించారు. ఆదోని ఎస్టీయూ భవన్లో STU ఆదోని, కౌతాళం మండల నాయకుల సమావేశం జరిగింది. సమావేశానికి కె. లక్ష్మణ అధ్యక్షత వహించారు. వెంటనే PRC కమిషన్ నియమించడంతో పాటు పెండింగ్ DAలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.