PLD: వడ్డెరలంతా ఐక్యమత్యంగా ఉండి ఆర్థికంగా బలోపేతం కావాలని టీడీపీ యువ నాయకులు ఎమ్మెల్యే తనయుడు జూలకంటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఆదివారం మాచర్ల పట్టణంలో వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయం వద్ద నిర్వహించిన ఓబన్న జయంతి కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర సంగ్రామంలో ఓబన్న కృషిని పలువురు వక్తలు వివరించారు.