PPM: మనం అందించే ఏ చిన్న సాయమైనా ఎంతోకొంత ప్రయోజనం ఉంటుందని సీతానగరం మండలం బూర్జ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి డా. టీ.హేమాక్షి పేర్కొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా పార్వతీపురం మండలం దాలినాయుడువలస గ్రామంలో ఆదివారం సేవా కార్యక్రమం నిర్వహించారు. పేదలకు, వృద్ధులకు దుప్పట్లు, పండ్లు అందజేశారు. అనంతరం వారి ఆరోగ్య సమాచారం తెలుసుకుని తగు సూచనలు చేసారు.