MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో రాత్రివేళలో దొంగతనాల నివారణకు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలు స్వస్థలాలకు వెళ్తున్నారన్నారు. అయితే ప్రజలు ఇళ్లల్లో బంగారం, వెండి, నగదును ఉంచవద్దని కోరారు. వీలైతే ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు అమర్చాలన్నారు.