E.G: ప్రజలు విన్నవించిన అన్ని సమస్యలకు తాము పరిష్కారం చూపిస్తామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రాజమండ్రిలోని 2వ డివిజన్లో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. స్వీకరించిన అర్జీల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. మీ భద్రత మా బాధ్యత మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు.