భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ నటిస్తున్న భారీ చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమాను ఏప్రిల్ 17న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం VFX పనులు జరుగుతున్నాయి. అవుట్పుట్ చూశాక OTT భాగస్వాములు విడుదల తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకోనున్నట్లు సమాచారం. పీరియడ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.