నంద్యాల: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో పారదర్శకత కోసమే సోసియల్ ఆడిట్ జరుగుతుందని డ్వామా పీడీ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం నంద్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో 2024 – 25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 19 విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక జరిగింది.