WGL: పర్వతగిరి మండల కేంద్రం శివారులో నెక్కొండ వెళ్లే రహదారిలో బుధవారం కారు ప్రమాదం జరిగింది. మూలమలుపు వద్ద వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కన చెరువు కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు గుర్తించి వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.