ELR: రైతాంగ సమస్యల పరిష్కార వేదికగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృషి చేస్తోందని రైతు సంఘం నేత శ్రీనివాస్ వివరించారు. ఏలూరులో ఆయన మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందడం లేదని, ఫలితంగా అన్నదాతలు నష్టపోతున్నారని చెప్పారు. దేశంలో రైతాంగ ఆత్మహత్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.