AP: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు కూటమి నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే, గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు.