TG: ఆర్టీసీ యాజమాన్యానికి జేఏసీ నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు. 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలని కోరారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ.350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలన్నారు. పాత బకాయిలు రూ.2,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని తెలిపారు.