కడప: నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ రాకేష్ చంద్ర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షణంలో మంచి ర్యాంకు సాధించేందుకు నగర పరిశుభ్రత, చెత్త నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నగరాభివృద్ధి కోసం టాక్స్ కలెక్షన్ పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు మరింతగా చేపట్టాలని తెలిపారు.