VSP: మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుంకుమార్చన, పుష్పార్చన చేశారు. అనంతరం కర్పూర హారతి, నీరాజన మంత్ర పుష్పం సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.