అమెరికా ఆతిథ్యమివ్వనున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో పాల్గొనవద్దంటూ ఇరాన్ ఫుట్‌బాల్ జట్టుకు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తమ దేశానికి వస్తే ఇరాన్ ఆటగాళ్ల భద్రతకు, ప్రాణాలకు తాము ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేమని ఆయన చెప్పడం సంచలనంగా మారింది. అయితే, ఇరాన్ ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనబోమని ప్రకటించింది. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి.