BDK: మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును శుక్రవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు తమకు ఎదురవుతున్న వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.