IPL- 2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయంపై కేకేఆర్ యాజమాన్యం స్పందిస్తూ.. ‘హర్షిత్ రాణా గాయం మాకు పెద్ద ఎదురుదెబ్బ. అతని స్థానంలో ఎవరిని తీసుకోవాలనేది ఇంకా నిర్ణయించలేదు. కానీ మా బౌలింగ్ విభాగంలో అతని లోటు స్పష్టంగా కనిపిస్తుంది’ అని పేర్కొంది.