TG: గాంధీ స్ఫూర్తి కోసం వారి అస్తికలను దేశంలో వివిధ ప్రాంతాల్లో పెట్టారని సీఎం రేవంత్ అన్నారు. కన్యాకుమారి వద్ద రెండు సముద్రాలు కలిసే చోట గాంధీ అస్తికలు పెట్టారన్నారు. మూసీ, ఈసీ సంగమం లంగర్ హౌస్ వద్ద బాపూ ఘాట్‌ను పర్యాటక కేంద్రం చేస్తామన్నారు. కన్యాకుమారి మాదిరిగానే బాపూఘాట్ రెండు నదుల సంగమమని ఎందరికి తెలుసు? అని ప్రశ్నించారు.