NTR: జిల్లాలో వంట గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలోని ఐవోసీఎల్ బాట్లింగ్ ప్లాంటును శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, సరఫరా సజావుగా కొనసాగుతోందన్నారు. తప్పుడు వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.