TG: విదేశాల్లో పలు నదులను సందర్శించి అధ్యయనం చేశామని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికీ బృహత్కార్యాచరణ చేపట్టకపోతే భవిష్యత్ తరాలు క్షమించవన్నారు. మూసీ అభివృద్ధిని BJP, BRS ఎందుకు అడ్డుకుంటున్నాయని ప్రశ్నించారు. అపార మేధో సంపత్తి ఉందని చెప్పేవారే.. ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏమైనా తప్పులు చేస్తే సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధమన్నారు.