TG: నదీ పరివాహక ప్రాంతంలో ఎకనమిక్ జోన్ తయారుచేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ నగరంలోని చెరువులు పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. చెరువులు పునరుద్ధరిస్తున్నందుకు ప్రజలు తమకు ఘనస్వాగతం పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. నీళ్లు ప్రవహించే ప్రాంతాలను మనం ఆక్రమించుకోవడం వల్ల వరదలొస్తున్నాయన్నారు.