కృష్ణా: పెనమలూరు నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడిగా కంకిపాడుకు చెందిన విద్యార్థి నాయకుడు తలారి హరిని టీడీపీ శుక్రవారం నియమించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలపై చురుకుగా పనిచేస్తూ, విద్యార్థుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న హరికి ఈ బాధ్యత అప్పగించినట్లు తెలిపారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించారు.