NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో సీఐ శ్రీనివాసరావు రాత్రి సమయాలలో ఖాళీ ప్రదేశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న పలువురుని పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. మండలంలో ఎక్కడైనా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానా విధిస్తామని తెలిపారు.