TG: గోదావరి జలాలు 20 టీఎంసీలను మూసీకి తరలించే పనులు చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మూసీలో నిరంతరం 2.5 టీఎంసీల గోదావరి జలాలు ప్రవహించేలా చర్యలు చేపడుతామన్నారు. మిగతా 17.5 టీఎంసీల గోదావరి జలాలతో హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చే ప్రయత్నం చేస్తామన్నారు. ఫ్లోరైడ్ వల్ల నల్గొండ నివాస యోగ్య ప్రాంతం కాదని WHO చెప్పిందన్నారు.