HNK: దేశంలో పెరిగిన గ్యాస్, నిత్యావసరాల ధరలను అదుపు చేయటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి అన్నారు. గుండ్ల సింగారంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ఆచరణలో అరకొర అమలు చేసి గొప్పలు చెప్పుకుంటున్నాయన్నారు.