KNR: సాంప్రదాయ వృత్తులకు పూర్వవైభవం తెచ్చేందుకే ప్రధాని మోదీ ‘విశ్వకర్మ యోజన’ ప్రవేశపెట్టారని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. చింతకుంటలో 56 మంది లబ్ధిదారులకు ఆయన పరికరాల కిట్లను పంపిణీ చేశారు. శిక్షణతో పాటు రూ.15 వేల విలువైన కిట్లు, తక్కువ వడ్డీకే రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.