T20 WCలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ, ఇప్పుడు IPLలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. కోల్కతా నైట్ రైడర్స్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ స్థానాన్ని ముజరబానీతో భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారక ప్రకటన రానుంది. గతేడాది RCB జట్టులో ఉన్నప్పటికీ ముజరబానీకి తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు.